HomeTelugu Newsమృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్‌

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్‌

7 6

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని తెలిపారు. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. రెండు నుంచి మూడు రోజల పాటు ఆస్పత్రిలో ఉన్నవారికి రూ. లక్ష పరిహారం చెల్లిస్తామన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తామని చెప్పారు. లీకైన గ్యాస్‌ ప్రభావం కొన్ని రోజుల పాటు ఉంటుందని.. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మనాభపురంలో ఈ ప్రభావం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని జగన్‌ వివరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎల్జీ పాలిమర్స్‌ ఒక అంతర్జాతీయ సంస్థ అని.. అలాంటి సంస్థలో ఇలాంటి దుర్ఘటన జరగడం విస్మయానికి గరిచేసింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఘటన జరిగిన తీరుపై వీరు అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సి చర్యలపై కూడా ఈ కమిటీ పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ విషయంలో అనుసరించాల్సిన తీరుపై నిర్ణయం తీసుకుంటాం” అని జగన్‌ వివరించారు. ఘటన జరిగిన వెంటనే సకాలంలో స్పందించి దాదాపు 340 మందికిపైగా స్థానికులను అంబులెన్సుల ద్వారా అక్కడ నుంచి తరలించిన అధికారులను సీఎం అభినందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu