Vivek Athreya Ante Sundaraniki:
వివేక్ ఆత్రేయ 2017లో రొమాంటిక్ కామెడీ మెంటల్ మదిలో సినిమాతో డైరెక్టర్ డెబ్యూ చేశారు. ఆ తర్వాత, ఆయన క్రైమ్ కామెడీ బ్రోచేవారెవరురా తో పెద్ద హిట్ అందుకున్నారు. తన మూడవ చిత్రంగా నానితో కలిసి అంటే సుందరానికి అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేశారు. అయితే, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశించినంతగా స్వీకరించకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద సినిమా ఫ్లాప్ అయ్యింది.
నెక్స్ట్ సినిమాలో కూడా వివేక్ మరోసారి నానితో జతకట్టి కొత్త ప్రయోగం చేశారు. ఈ సారి, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక కమర్షియల్ సినిమాను తీసుకువచ్చారు. సరిపోదా శనివారం టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో విజయవంతంగా రన్ అవుతోంది.
తాజా ఇంటర్వ్యూలో వివేక్ మాట్లాడుతూ అంటే సుందరానికి స్క్రిప్ట్ తనకు చాలా ఇస్తమైనది అని అన్నారు. “అంటే ఫ్లాప్ సినిమా అవ్వడం నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించింది. నేను ఇప్పటికీ ఆ సినిమా స్క్రిప్ట్‌ను గొప్పదిగా అనుకుంటాను. సరిపోదా శనివారం ఒక ప్యాకేజ్డ్ స్క్రిప్ట్. కానీ ఒక రచయితగా, అంటే సుందరానికి తోనే నేను ఎక్కువ సంతృప్తి గా అనిపించింది” అని అన్నారు వివేక్ ఆత్రేయ.
వివేక్ మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో చాలా మంది అంటే సుందరానికి సినిమాను వ్యక్తిగతంగా ఇష్టపడతారు. కానీ కమర్షియల్ గా ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది.