HomeTelugu Trendingబిగ్‌బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు..

Vithika sheru shocking comm

తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే 3 సీజన్ పూర్తి చేసుకుని 4వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సీజన్‌-4కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చాలా మంది బయటకు వచ్చి షో పై విమర్శలు చేయడం మనము చూస్తూనే ఉన్నాం. తాజాగా వితిక షేరు కూడా బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వితిక. 15 ఏళ్ల వయసులో కన్నడ సినిమాలో నటించింది. ఆతర్వాత తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మంచు మనోజ్ నటించిన ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుంది. ఇక వితిక తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి బిగ్‌బాస్‌-4లో కంటెస్టెంట్ గా పాల్గొంది . తాజాగా బిగ్ బాస్ పైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వితిక మాట్లాడుతూ .. ‘బిగ్‌బాస్’ లో మంచి వుంది ,చెడూ వుంది. 24 గంటల జీవితంలో బిగ్‌బాస్ గంటలో క్యారెక్టర్ లని డిసైడ్ చేస్తుంటారని.. ఇందులో పాల్గొనే వాళ్లు చేసేది నటనే కాకుండా కొంత అతిగా కూడా వుంటుందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu