HomeTelugu Trendingటాలీవుడ్‌లో హీరోయిన్‌గా 'విశ్వాసం' చైల్డ్‌ ఆర్టిస్ట్‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ‘విశ్వాసం’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌

Viswasam Child Artist as

టాలీవుడ్ యంగ్‌ హీరోలు న‌వీన్ చంద్ర‌, విశ్వ‌క్ సేన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో త‌మిళ భామ అనిఖ సురేంద్ర‌న్ ను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ అమ్మాయి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎన్నై అరింధాల్‌, విశ్వాసం చిత్రాల్లో బాల‌న‌టిగా ఉత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది అనిఖ సురేంద్ర‌న్‌. చైల్డ్ ఆర్టిస్టుగా కేర‌ళ రాష్ట్రం నుంచి చాలా అవార్డులు అందుకుందీ బ్యూటీ. ఇపుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం క‌ప్పెల‌. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

తెలుగు రీమేక్ లో అనిఖ‌ను వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన వ్య‌క్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత బ‌యోగ్రాఫిక‌ల్ డ్రామాగా వ‌చ్చిన క్వీన్ వెబ్ సిరీస్ లో న‌టించింది అనిఖ‌ సురేంద్ర‌న్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu