Chiranjeevi rejected by Vishwanath:
మెగాస్టార్ Chiranjeevi తనయుడు రామ్ చరణ్ సినీ కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. మగధీర చిత్రం రాజమౌళి దర్శకత్వంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన తర్వాత, రామ్ చరణ్ ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంలో చిరంజీవి చాలా ఆలోచనలు చేశారు. అయితే ఆరెంజ్ సినిమా భాస్కర్ దర్శకత్వంలో తీస్తే అది ప్లాప్ అవడంతో ఆ ప్లాన్ తప్పిపోయింది.
ఆ తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కోసం పలు దర్శకుల పేర్లు పరిశీలించారు కానీ ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. చివరికి చిరంజీవి కలాతపస్వి కె. విశ్వనాథ్ గారిని కలిసి రామ్ చరణ్ కోసం సినిమా చేయాలని అడిగారు. అయితే, విశ్వనాథ్ గారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
విశ్వనాథ్ గారు చిరంజీవితో మాట్లాడుతూ – “నేను ఇప్పుడు సినిమాలు తీయడం ఆపేశాను, నటనపై దృష్టి సారించాను. పైగా, నేను దర్శకత్వం వహించినా ఇప్పుడు ఎవ్వరూ ఆ సినిమాలు చూడరు” అని స్పష్టంగా చెప్పారు.
ఈ విషయాన్ని విన్న మెగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. “విశ్వనాథ్ గారు రామ్ చరణ్ కోసం సినిమా తీస్తే అది బ్లాక్‌బస్టర్ అయి ఉండేది” అని భావిస్తున్నారు. చిరంజీవి చేసిన ప్రయత్నం విఫలమైనా, రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.