HomeTelugu TrendingVS14: అనుదీప్ తో సినిమాకి విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

VS14: అనుదీప్ తో సినిమాకి విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Vishwak Sen to bag huge remuneration with VS14?
Vishwak Sen to bag huge remuneration with VS14?

Vishwak Sen Remuneration for VS14:

మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ హీరో విశ్వక్ సేన్ తీరు వేరు. వరుసగా సినిమాలు చేసేయాలి అని ఆలోచించకుండా.. డిఫరెంట్ జోనర్ లలో సినిమాలు చెయ్యాలి అని అనుకునే హీరో విశ్వక్. ఈ నేపథ్యంలోనే గామి వంటి సినిమాలు కూడా చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఒకవైపు ఫలక్నుమా దాస్ వంటి మాస్ సినిమాలతో మాత్రమే కాకుండా.. అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటి ఎంటర్టైనింగ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించారు. చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విశ్వక్ ఇప్పుడు బాగానే పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో విశ్వక్సేన్ రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకుముందు వరకు చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉండేవి ఇప్పుడు మాత్రం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పెద్దగా మెప్పించ లేకపోయిన విశ్వక్ తాజాగా ఇప్పుడు మెకానిక్ రాకీ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత లైలా అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన చిత్ర పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

జాతి రత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో కూడా విశ్వక్ సే ఒక సినిమాని ప్రకటించారు. ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత.. గ్యాస్ ఆఫ్ గోదావరి సినిమాకి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య డైరెక్షన్లోనే.. పవర్ పేట అనే సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించాలి కానీ.. చివరికి ఈ సినిమా విశ్వక్ సేన్ చేతుల్లోకి వచ్చింది

చేతిలో ఉన్న సినిమాలకు తగ్గట్టుగానే విశ్వక్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. అనుదీప్ తో చేస్తున్న సినిమా కోసం విశ్వక్ ఏకంగా ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu