HomeTelugu Trendingపాగల్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

పాగల్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Vishwak sen paagal movie re

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం పాగల్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డింది. ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆగస్టు14న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ ఎర్ర గులాబీని పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తుండగా ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu