HomeTelugu TrendingVishwak Sen: గూండా కాస్తా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా మారిపోయాడు

Vishwak Sen: గూండా కాస్తా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా మారిపోయాడు

Vishwak Sen launched his next film
Vishwak Sen launched his next film

Vishwak Sen Upcoming Movies:

యంగ్ హీరో Vishwak Sen ఇప్పుడు వరుస సినిమాలతో ఒక రేంజ్ లో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ చేతినిండా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒక సినిమా పూర్తికాకముందే మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ లైన్ అప్ ఏర్పరచుకున్నారు.

తాజాగా ఇప్పుడు మరొక సినిమాని అధికారికంగా లాంచ్ చేశారు. శ్రీధర్ గంట అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ పరిచయం కాబోతున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగి అధికారికంగా లాంచ్ అయ్యింది.

సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కన్నడ హీరోయిన్ సంపాద ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. కాంతారా ఫేమ్ అజినీష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిన్న మొన్నటిదాకా మాస్ గుండా పాత్రలు చేసిన విశ్వక్ సేన్ ను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడడానికి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మెకానిక్ రాకీ. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఒక సినిమాకి లైలా అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. అందులో Vishwak Sen ఒక విభిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వంలో కూడా విశ్వక్ సేన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu