విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ గత వారం లో రిలీజ్ అయినా ఈ సినిమా హిట్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది …ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం కోసం ఆయన ఒక ప్రాంక్ వీడియో చేశారు. దానిపై ఒకరు కంప్లయింట్ చేయడం, టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించడం, అందులో వాగ్వాదం చోటు చేసుకోవడం… విశ్వక్ సేన్‌ను వార్తల్లో నిలిపాయి. సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆరు వారాలకు తిరిగి ఓటీటీలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి ఇక సినిమా కి వస్తే ముందే రిలీజ్ అవ్వుతుంది అని ఓటీటీలో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది అని వైరల్ అవ్వుతుంది… ఇక ఈ విషయం పై విశ్వక్ సేన్ వీడియో షేర్ చేసారు…..
ఈ వీడియోలో …‘‘ నమస్తే అందరికీ.. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థాంక్యూ సో మచ్, థియేటర్ వరకు వచ్చి నా సినిమా చూస్తున్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ కూడా నాకు హోప్ ఇచ్చినందుకు సినిమాలు తీయడానికి.అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది.. మేం అనౌన్స్ చేస్తాం. డేట్ వేసేసి అన్ని చెప్పేసి.. సినిమా థియేటర్లకు వచ్చేవాళ్లను చెడగొట్టకండి. నిజం చెప్పాలంటే ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో నాకే తెలియదు. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్ చేసేయండి. రూమర్స్ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్ వివరించారు.
View this post on Instagram