Vishwak Sen Instagram: విశ్వక్ సేన్ హీరోగా ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. స్వీయ దర్శకత్వంలో నేహా శట్టి హీరోయిన్ గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన రెండు వారాలకి ఓటిటి ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రత్యక్షమైపోయింది. ఈ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇచ్చిన ఒక యూట్యూబర్ పై.. విశ్వక్ సేన్ ఇప్పుడు మండిపడుతున్నాడు. ఆ యూట్యూబర్ మాట్లాడిన మాటలను పోస్ట్ చేస్తూ.. అతనికి ఘాటుగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా రిప్లై ఇచ్చాడు విశ్వక్ సేన్.
Vishwak Sen Instagram Story:
“సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకొని బయలుదేరుతున్నారు. యూట్యూబ్ లో మీ ఇన్కమ్ కోసం వెయ్యికి పైగా కుటుంబాలతో రన్ అవుతున్న ఇండస్ట్రీ తో మజాక్ లు అయిపోయాయి మీకు. వీడు ఒక 10 మినిట్స్ షార్ట్ ఫిలిం తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాడు అనుకోని ఇగ్నోర్ చేద్దాం. టెన్ మినిట్స్ షార్ట్ ఫిలిం తీయండి ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్లో పెట్టి తిరిగేవాళ్లు అందరూ. పైరసీ కంటే ఇక్కడ ఉండే కొంతమంది జనాలు ఇంకా డేంజరస్ గా ఉన్నారు. ప్రతిరోజు ఒక సినిమా సెట్ రన్ అవ్వడం మీద ఆధారపడే జీవితాల కోసం మేము పెట్టే చెమట, బ్లడ్ మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నువ్వు తియ్యి ఒక 10 మినిట్స్ షార్ట్ ఫిలిం అప్పుడు నీకు, నీ ఒపీనియన్ కి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది” అంటూ విశ్వక్ ఒక రేంజ్ లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
అయితే విశ్వక్ ఇచ్చిన రిప్లై పక్కన పెడితే అసలు సినిమా మేకింగ్ గురించి మాట్లాడే హక్కు నిజంగా విశ్వక్ కి ఉందా అని మరి కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే విశ్వక్ సేన్ కెరియర్ లో కేవలం విశ్వక్ వల్లే హిట్ అయిన సినిమాలు ఏమీ లేవు. ఈ నగరానికి ఏమైంది, హిట్ వంటి సినిమాలు డైరెక్టర్ లేదా కథలు వల్ల హిట్ అయ్యాయి. అవి కాకుండా విశ్వక్ నటించిన సినిమాలలో హిట్ అయిన ఒకటి రెండు ఏదో ఫ్లూక్ లో విజయాలను సాధించాయి.
కానీ ఏదో ప్రతి సినిమా తన వల్లే హిట్ అయినట్టు క్రెడిట్ మొత్తం తీసుకొని ఇలా రివ్యూయర్ ల మీద ఎగిరి పడటం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు విశ్వక్ ను రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ ఒకే టెంప్లేట్ సినిమాలు తీయడం తప్ప విశ్వక్ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ తీయడం లేదు. ఒకవేళ తీసినా కూడా అవి ప్రేక్షకులను అలరించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల పల్స్ కూడా తెలుసుకోలేని ఒక హీరో సినిమా గురించి, సినిమా మేకింగ్ గురించి ఎలా మాట్లాడగలడు అని మరికొందరు విశ్వక్ నే రివర్స్ లో తిడుతున్నారు.