టాలీవుడ్ హీరో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మోసగాళ్లు. దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సినిమాని డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించారు. నవదీప్, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ఈ సినిమాలో ప్రధానపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను ఆట్టుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్ నటించింది. శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు.
And it’s here! On @primevideoIN pic.twitter.com/ThdLAA6hIk
— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2021