తమిళ ప్రముఖ నటుడు విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘దేవి -2’ ఫేమ్ డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం డింపుల్ తెలుగులో రవితేజ సరసన ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘ఎనిమి’ సినిమాలో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలానే మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్ -2’ చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. దాంతో శరవేగంగా ఈ 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి అతనే నిర్మాత కూడా…!
Shooting of @VishalKOfficial ‘s #vishal31 starts from today with Pooja.
To be directed by @THUPASARAVANA.
All the best to the whole team fr & safe shooting+Tremendous Success. #NotACommonMan @VffVishal @thisisysr @balasubramaniem @johnsoncinepro @HariKr_official pic.twitter.com/vO3bcto0hF
— Ramesh Bala (@rameshlaus) May 6, 2021