HomeTelugu Reviews'విరూపాక్ష' మూవీ రివ్యూ

‘విరూపాక్ష’ మూవీ రివ్యూ

Virupaksha Review Neat and Gripping
మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్ త‌ర్వాత నటించిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని హార‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేశాయి. ఈరోజు ఏప్రియల్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ఈ సినిమా స‌క్సెస్‌ను ఇస్తుందా? అనేది తెలియాలంటే.. రివ్యూ చూడాల్సిందే.

అటవీ గ్రామంలో 90వ దశకంలో నడిచే కథ ఇది. రుద్ర‌వ‌నం అనే గ్రామంలో అంతు చిక్క‌ని స‌మ‌స్య‌తో పిల్ల‌లు చ‌నిపోతుంటారు. అయితే ఊరికి కొత్త‌గా వ‌చ్చి, ఊరి జ‌నాల‌తో పెద్ద‌గా క‌ల‌వ‌కుండా దూరంగా ఉండే వెంక‌టాచ‌లం కుటుంబం చేసే క్షుద్ర విద్య‌ల కార‌ణంగానే పిల్ల‌లు చ‌నిపోతున్నార‌ని ఊరివాళ్లు భావిస్తారు. దాంతో అంద‌రూ క‌లిసి వెంక‌టాచ‌లం, అత‌ని భార్య‌ను కొట్టి వారింటి ముందున్న చెట్టుకి క‌ట్టేసి కాల్చేస్తారు. వారికి ఓ పిల్లాడు ఉంటాడు. వాడి పేరు భైర‌వ‌. వాడిని కూడా చంపేయాల‌ని గ్రామ‌స్థులు అనుకుంటారు. అయితే, ఊరి పెద్ద హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్(రాజీవ్ క‌న‌కాల‌) అడ్డుకుని ఆ పిల్లాడిని ఓ అనాథ శ‌ర‌ణాల‌యంలో చేర్పిస్తాడు. ప‌న్నెండేళ్ల త‌ర్వాత రుద్ర‌వ‌నం గ్రామంలోకి సూర్య త‌న త‌ల్లితో క‌లిసి వ‌స్తాడు. ఎందుకంటే అది ఆమె ఊరు కాబ‌ట్టి. అక్క‌డ స్కూల్ కోసం భూమి కావాల‌ని హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ కోర‌టంతో ఆమె త‌న కొడుకు సూర్య‌తో క‌లిసి అక్క‌డికి వ‌స్తుంది.

 

సూర్య గ్రామంలో హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ కూతురు నందిని (సంయుక్తా మీన‌న్‌ )ని ప్రేమిస్తాడు. నందిని స్నేహితురాలు సుధ ప‌క్క ఊరి కుమార్‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటుంది. అదే స‌మ‌యంలో ఊర్లో క‌నిపించ‌కుండా పోయిన ఓ వ్య‌క్తి జాత‌ర జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌ళ్లీ వ‌స్తాడు. రాగానే అమ్మ‌వారి గుడిలోకి వెళ్లి ర‌క్తం కక్కుకుని చ‌నిపోతాడు. దాంతో ఊరి పూజారి (సాయిచంద్‌) ఊరికి అరిష్టమ‌ని చెప్పి, అంద‌రూ మైల‌ప‌డ్డార‌ని అంటాడు. అరిష్టం పోవాలంటే ఊరిని అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని అంటాడు. అదే స‌మ‌యంలో సూర్య కుటుంబాన్ని ఊరు వెళ్లిపోవాల‌ని కూడా పూజారి ఆదేశిస్తాడు. నందిని త‌న‌కు ఆమె ప్రేమ‌ను చెబుతుందేమోన‌ని ఎదురు చూసిన సూర్య చివ‌ర‌కు బ‌య‌లుదేరుతాడు.

virupaksha

అదే స‌మ‌యంలో నందినికి ఫిట్స్ వ‌స్తుంది. ఆమెకు ఇంజెక్ష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా ఇచ్చే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దాంతో ఊరు దాటిన సూర్య అష్ట‌దిగ్బంధ‌నంలోపు మ‌ళ్లీ ఊర్లోకి రావాల్సి వ‌స్తుంది. 8 ప‌గ‌ళ్లు, రాత్రుళ్లు ఊరిని దిగ్బంధంన చేస్తారు. అదే స‌మ‌యంలో సుధ త‌న ప్రేమ కోసం అష్ట‌దిగ్బంధ‌న నియ‌మాన్ని దాటి త‌న ల‌వ‌ర్ కుమార్‌తో క‌లిసి పారిపోవాల‌ని అనుకుంటుంది. కానీ కుమార్ ట్రెయిన్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. అక్క‌డి నుంచి ఆమె ఎవ‌రికీ చెప్ప‌కుండా ఊర్లోకి అడుగు పెడుతుంది. దాంతో ఊర్లో స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. సుధ చ‌నిపోతుంది. అలా మ‌రో ఇద్ద‌రు చ‌నిపోతారు. దాంతో అక్క‌డే ఉన్న సూర్య‌కు అనుమానం మొద‌ల‌వుతుంది. దాంతో అన్వేష‌ణ మొద‌లు పెడితే సుధ చ‌నిపోయిన విష‌యం తెలుస్తుంది.

దాంతో అస‌లు నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతూ వ‌స్తాయి. అస‌లు ఊర్లోని జ‌నాల‌ను చంపేయాల‌ని అనుకునేదెవ‌రు? సూర్య రుద్ర‌వ‌న గ్రామాన్ని ఎలా కాపాడాడు? చివ‌ర‌కు సూర్య‌కు తెలిసే షాకింగ్ నిజ‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ తరహా సినిమాలు ఇప్పడు ఎక్కవగా విజయం సాధిస్తున్నాయి. జోన‌ర్ ఏదైనా మంచి క‌థ‌, క‌థ‌నం, ఆసక్తిక‌ర‌మైన స‌న్నివేశాలు ఎంతో ముఖ్యం. వీటికి నటీనటుల పెర్పామెన్స్‌తో పాటు మంచి సాంకేతిక అంశాలు క‌లిస్తే సినిమా మంచి విజయం సాధిస్తుంది. డైరెక్టర్‌ కార్తీక్ దండు… దీన్ని దృష్టిలో పెట్టుకునే విరూపాక్ష క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంగేజింగ్‌గా మ‌లుచుకుంటూ వ‌చ్చాడు.

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్రయత్నాని తెర‌పై చ‌క్క‌గా చూపించాడు. సినిమాలో ల‌వ్ అనే ఎలిమెంట్‌ను ఓ పార్ట్‌గా చూపిస్తూ దాని చుట్టూ మిస్టీక్ స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అల్లుకుంటూ వ‌చ్చాడు. క్లైమాక్స్‌లో ముగింపుకు కూడా ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా ఉంది. అజ‌నీష్ లోక్‌నాథ్ బీజీఎం సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాడు. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

virupaksha2

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే.. సూర్య పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. హీరోయిన్ సంయుక్తా మీన‌న్‌కి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. త‌ను చుట్టూనే సినిమా ర‌న్ అవుతుంది. దానికి ఆమె యాక్టింగ్‌తో జీవం పోసింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సంయుక్త న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్ పాత్ర‌లో రాజీవ్ క‌న‌కాల‌, మ‌రో ఊరి పెద్ద పాత్ర‌లో సునీల్, పూజారి పాత్ర‌లో సాయిచంద్, ఫ్రెండ్ రోల్ చేసిన అభిన‌వ్ గోమ‌టం ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు.

టైటిల్‌ :విరూపాక్ష
నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త, రాజీవ్ కనకాల, సాయిచంద్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్
దర్శకత్వం: గుణ శేఖర్
నిర్మాత: కార్తీక్ దండు

చివరిగా: మంచి థ్రిల్లింగ్‌ మూవీ

ాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu