HomeTelugu Big Storiesవిరాటపర్వం టీజర్‌

విరాటపర్వం టీజర్‌

Virata Parvam Teaserరానా-సాయి పల్లవి హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. వాస్తవ కథకు దగ్గరగా, ఎంతో రియలిస్టిక్‌గా టీజర్‌ ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునన్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu