Virat Kohli-Anushka Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ , విరాట్ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. కోహ్లీ రెండు మ్యాచులు ఆడలేదని, అతడు క్షేమంగా ఉన్నాడని, ప్రస్తుతం అతను తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడని డివిలియర్స్ తెలిపారు. ఈ కారణం వల్లే కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడని అన్నారు.
అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వనుందని అన్నారు. ఇంతకు మించి తానేమీ చెప్పాలనుకోవడం లేదని అన్నారు. తన మొబైల్‌లో టెక్స్ట్ మెసేజ్ చూస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. డివిలియర్స్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే. కోహ్లీకి ఆయన మంచి స్నేహితుడు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇప్పటికే ఒక పాప ఉంది. 2021 జనవరి 11న ‘వామిక’ పుట్టింది. తాజా కోహ్లీ, అనుష్క ఒక హోటల్లో కనపడిన వీడియో వైరల్ అయింది. అనుష్క బేబీ బంప్‌తో కనిపిస్తోందని కొందరు కామెంట్లు చేశారు. ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆ వార్తను కన్ఫర్మ్ చేశాడు.