HomeTelugu Trendingవిరాట్ కోహ్లీ, అనుష్క విడాకులు.. టాప్‌ ట్రెండ్‌

విరాట్ కోహ్లీ, అనుష్క విడాకులు.. టాప్‌ ట్రెండ్‌

9 5
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్ గా గుర్తింపు ఉంది. పెళ్లి చేసుకోవడానికి ముందు డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి కూడా వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ… వైవాహిక జంటలకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రస్తుత లాక్‌డౌన్ టైమ్‌లో కూడా ఇంటిపట్టునే ఉంటూ తమ ప్రేమానురాగాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. బెస్ట్ కపుల్ గా ఉన్న వీరిద్దరికీ ట్వీట్టర్‌లో షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం ట్విట్టర్ లో #VirushkaDivorce (విరుష్క విడాకులు) అనే అంశం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ఓ పాత వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ వార్త 2016 ఫిబ్రవరి నాటిది. అప్పుడే వీరిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. అప్పటి వార్త ఇప్పుడు మళ్లీ ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై విరుష్క ఫ్యాన్స్ కూడా సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu