బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ ఏజ్‌లో కూడా.. తన గ్లామర్ ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక దానికోసం పక్కా డైట్ ఫాలో అవుతారు. రైస్ తినరు.. ఇక బిర్యానీల సంగతి అంటే అస్సలు చెప్పనవసరం లేదు.
అయితే సల్మాన్ మాత్రం తిండి అసలు కంట్రోల్ చెయ్యడంట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు.. నటుడు విందు దార సింగ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సల్మాన్, నేను చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. నేను బరువు పెరగడం చూసి సల్మాన్ జిమ్ జాయిన్ అయ్యినట్లు చెప్తాడు. ఎక్కువసేపు జిమ్ లోనే ఉంటాడు. అలా అని తినకుండా మాత్రం ఉండడు. తిండి విషయంలో అస్సలు కంట్రోల్ పెట్టుకోడు. పందిలా తింటాడు.. కుక్కలా వర్క్ అవుట్ చేస్తాడు. అదే సల్మాన్ పాలసీ. అంతా తిన్నావు..
అదంతా ఏది.. అంటే వర్క్ అవుట్ చేసి కరిగించేసాను అని చెప్తాడు.
ఇంకా.. సల్మాన్ ది చాలా మంచి మనసు. అతనొక అద్భుతమైన వ్యక్తి. సాయం చేసే గుణం ఎక్కువ.. తన తండ్రి తనకు డబ్బులిస్తే.. వాటిని ఇంట్లో పనిచేసేవారికి పంచిపెట్టేవాడు. అది ఎంత అయినా సరే.. ఒక్కోసారి అవి లక్షల్లో ఉండేవి. ఇప్పటికీ సల్మాన్ అలానే ఉన్నాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఎంత సంపాదించినా.. తన పాకెట్ మనీ మాత్రం తండ్రి దగ్గరే తీసుకుంటాడు. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోడు. సల్మాన్ వ్యక్తిత్వం వేరు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.