HomeTelugu Trendingరామ్‌చరణ్‌ 'వినయ విధేయ రామ' ట్రైలర్‌

రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌

7 23

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్‌ పల్స్‌కు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ టీజర్‌, సాంగ్స్‌ ఇప్పటికే వైరల్‌ అయ్యాయి.

గురువారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సరైన సింహం తగలనంతవరకు ప్రతీ వేటగాడు మగాడేరా.. అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్‌ మాస్‌కు పిచ్చేక్కించేలా ఉంది. ఇప్పటివరకు యాక్షన్‌ సీన్స్‌ను తనదైన శైలిలో చూపించిన బోయపాటి.. చెర్రీలోని విశ్వరూపాన్ని చూపించేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. ఈ సినిమాలో భరత్‌ అనే నేను ఫేమ్‌ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu