టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి , మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. కశ్మీర పరదేశి ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. అల్లు అరవింద్, బన్నీ వాసు, హరీశ్ శంకర్, మారుతి, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. చీఫ్ గెస్టుగా హీరో సాయితేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. హీరోయిన్ తో హీరో లవ్ .. ఆమె తండ్రితో కామెడీ .. విలన్ గ్యాంగ్ తో యాక్షన్ అంశాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఇది తిరుపతి నేపథ్యంలో నడిచే కథ. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ మంచి స్పందన వచ్చింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.













