HomeTelugu Reviews'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌' రివ్యూ

‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌’ రివ్యూ

vinaro bhagyamu vishnu kath 1
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌’. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు విడుదలైన అప్డేట్స్‌తోనే సినిమాపై జ‌బ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు కిరణ్‌ అబ్బవరం సరైన హిట్‌ లేదనే చెప్పాలి. మ‌రి సినిమా ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌’ ప్రేక్ష‌కుల‌ను ఎంత వరకు ఆకట్టుకుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా స‌క్సెస్‌ సాధిస్తాడా చూడాలి. ఇక సినిమా విషయానికి వస్తే..

విష్ణు (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) తిరుప‌తి లైబ్ర‌రీలో ప‌ని చేస్తుంటాడు. ప‌క్క‌నున్న‌వాళ్లు ఇబ్బందుల్లో ఉంటే వీలైనంత సాయం చేయాలి అనుకునే వ్యక్తి. రాజ‌న్ (శ‌ర‌త్ లోహిత్య‌) అనే డాన్ ఇండియాను నాశ‌నం చేయ‌టానికి ఓ ప్లాన్ చేస్తాడు. ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌స్తాడు. అప్ప‌టికే పోలీసుల‌కు విష‌యం తెలియ‌టంతో అతని క‌ద‌లిక‌ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు. ఈ క్రమంలో అతనికి ఒక మనిషి కావాల్సి వస్తుంది. అందుకోసం నైబ‌రింగ్‌ నంబ‌ర్ ప‌ర్స‌న్‌ ‘విష్ణు’ ని పిలుస్తాడు. రాజ‌న్ ద‌గ్గ‌ర‌కు విష్ణు వచ్చిన తరువాత కథ ప్రారంభం అవుతుంది.

తిరుప‌తిలో ఉండే విష్ణుకి నెయ్‌బ‌రింగ్ నైబ‌ర్‌ కాన్సెప్ట్‌తోనే ద‌ర్శ‌న (కాశ్మీర ప‌ర‌దేశి) ప‌రిచ‌యం. అలాగే శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌) కూడా ప‌రిచ‌యం అవుతాడు. ముగ్గురు క‌లిసి యూట్యూబ్‌లో రీల్స్ చేస్తుంటారు. మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌న‌తో విష్ణు ప్రేమ‌లో ప‌డ‌తాడు. దర్శన కూడా విష్ణుని ప్రేమిస్తుంది.. కానీ చెప్పదు. ఈ టైమ్‌లో మంత్రి కావాల‌నుకున్న ఎమ్మెల్యే (కె.జి.య‌ఫ్ ల‌క్కీ) శ‌ర్మ‌ను చంప‌టానికి ప్లాన్ చేస్తాడు. ఓ కిల్ల‌ర్ ఏర్పటు చేస్తుంది. అనుకోకుండా ఓరోజు శ‌ర్మ‌ను ద‌ర్శ‌న తుపాకీతో కాల్చేస్తుంది.

vinaro bhagyamu vishnu 1

అస‌లు శ‌ర్మ‌కు, ఎమ్మెల్యేకి లింకు ఏంటి? ఎందుకు చంపాల‌నుకుంటాడు? శ‌ర్మ‌ను ద‌ర్శ‌న ఎందుకు కాలుస్తుంది? ద‌ర్శ‌న‌ను విష్ణు ఎలా కాపాడుకున్నాడు? అస‌లు తిరుప‌తి నుంచి విష్ణు హైద‌రాబాద్ ఎందుకు వ‌స్తాడు? అనే ఆసక్తికర అంశలతో కథ సాగుతుంది.

మ‌న ప‌క్కన ఉండే వాడే మ‌న బంధువు. మ‌నం చూసే స్థాయిని బ‌ట్టి మ‌న ప్రపంచం ఉంటుంది అనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌’. ప‌క్క‌వాడు ఎలా పోతే ఏంటి? అనుకునే ఈ రోజుల్లో, మ‌నం మ‌నుషులం ప‌క్క‌నున్న వాడు క‌ష్టాల్లో ఉంటే సాయం చేయాల‌నే కాన్సెప్ట్‌తో హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు. ఆ క్యారెక్ట‌ర్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం అలా సెట్ అయిపోయాడు. త‌నది రాయ‌ల‌సీమ కావ‌టంతో చిత్తూరు యాస‌ను ఇజీగా మాట్లడేశాడు. విష్ణు పాత్ర‌ను చూస్తున్నంత సేపు మ‌న ప‌క్కింటి కుర్రాడిని ఫీలింగ్‌ కలుగుతుంది. ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌ర్ మీద‌నే ఫ‌న్నీగా సినిమా ర‌న్ అవుతుంది.

హీరోయిన్.. ముర‌ళీ శ‌ర్మ ఎంట్రీ త‌ర్వాత క‌థ‌లో ఇంకా వేగం పెరుగుతుంది. ముర‌ళీ శ‌ర్మ రోల్ సినిమాకు హైలైట్‌. త‌ను రీల్స్ రూపంలో హీరోల‌ను ఇమిటేట్‌ చేస్తూ.. డాన్స్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటాయి. కామెడీగా న‌వ్విస్తాయి. ఇక ముర‌ళీ శర్మ‌ను విల‌న్ చంపాల‌ని ప్లాన్ చేస్తాడో సినిమాలో అప్ప‌టి నుంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ర‌న్ అవుతాయి. కశ్మీరా ప‌ర‌దేశి పాత్ర ప‌రంగా న్యాయం చేసింది. ఇక హీరోయిన్ త‌ల్లిదండ్రులుగా దేవీ ప్ర‌సాద్‌, ఆమ‌ని, సాయి, శుభ‌లేక సుధాక‌ర్ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి.

vinaro bhagyamu vishnu 2

ఫ‌స్టాఫ్‌లో ముర‌ళీ శ‌ర్మ‌ను విల‌న్ ఎలా చంపుతాడోన‌ని ఎదురు చూసే ఆడియెన్స్‌కి హీరోయిన్ ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌ను కాల్చ‌టంతో ట్విస్ట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.. ఇక సెకండాఫ్ అంతా హీరోయిన్ ఎందుకు ముర‌ళీ శ‌ర్మ‌ను చంపాల‌నుకుంది. ఆమెను నిర్దోషిగా నిరూపించుకోవ‌టానికి హీరో ఏం చేశాడ‌నే దానిపై స్టోరి నడుస్తుంది. చివ‌ర‌కు ట్విస్ట్ రివీల్. మ‌రో వైపు రాజ‌న్ అనే డాన్ చుట్టూ క‌థ‌ను ర‌న్ చేస్తూ వ‌చ్చారు. రెండు, మూడు లేయ‌ర్స్‌ను తీసుకుని క‌థ‌ను అల్లారు ద‌ర్శ‌కుడు ముర‌ళీ కిషోర్‌.

ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా, సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌ బాగుంది. చైతన్ భ‌రద్వాజ్ సంగీతం, నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకుంటుంది. డిఫ‌రెంట్ మూవీస్ చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు సినిమా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చు. అయితే స‌ర‌దాగా కాసేపు న‌వ్వుకోవాల‌నుకునేవారు సినిమా చూసి ఎంజాయ్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు.

టైటిల్‌ :వినరో భాగ్యము విష్ణుకథ
నటీనటులు: కిరణ్ అబ్బవరం,కశ్మీరా పరదేశి,మురళీ శర్మ,ఆమని తదితరులు
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
సంగీతం: చైతన్ భ‌రద్వాజ్

చివరిగా: కాసేపు న‌వ్వించే వినరో భాగ్యము విష్ణు’కథ’

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu