HomeTelugu Reviews'విమానం' మూవీ రివ్యూ

‘విమానం’ మూవీ రివ్యూ

 

Vimanam Movie Review

తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. విమానం ఎక్కాల‌నే కొడుకు కోరిక‌ను తండ్రి ఎలా నేరవేర్చాడ‌నే క‌థాంశంతో రూపొందిన‌ట్లు స్పష్ట‌మ‌వుతుంది. అయితే దాన్ని ద‌ర్శ‌కుడు ఎంత హృద్యంగా తెర‌కెక్కించారు. అస‌లు పిల్ల‌వాడికి విమానం ఎక్కాల‌నే కోరిక ఎందుకు పుడుతుంది? చివ‌ర‌కు కొడుకు కోరిక‌ను తండ్రి ఎలా నేర‌వేర్చాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

వీర‌య్య(స‌ముద్ర ఖ‌ని) అవిటివాడు. భార్య చ‌నిపోవ‌టంతో అన్నీ తానై కొడుకు రాజు (మాస్ట‌ర్ ధ్రువ‌న్‌)ను పెంచి పెద్ద చేస్తుంటాడు. రాజు కూడా చ‌క్క‌గా చ‌దువుకుంటుంటాడు. అయితే త‌న‌కు విమానం అంటే తెలియ‌ని ప్రేమ. విమానం ఎక్కాల‌ని క‌ల‌లు కంటాడు. బాగా చ‌ద‌వుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని వీర‌య్య కూడా కొడుక్కి చెబుతుంటాడు. బ‌స్తీలో ఉండే వీర‌య్య‌కు తాత తండ్రుల నుంచి వ‌చ్చిన సుల‌భ్ కాంప్లెక్స్ మాత్ర‌మే జీవ‌నాధారం. రాజు కోరుకొండ సైనిక స్కూల్‌కి ఎంపిక అవుతాడు. ఇక త‌న కొడుకు భ‌విష్య‌త్తు మారిపోతుంద‌ని వీర‌య్య ఆనంద‌ప‌డిపోతాడు. అంత‌లో హ‌ఠాత్తుగా అనుకోని నిజం తెలిసి వీర‌య్య కుప్ప‌కూలిపోతాడు. ఎలాగైనా కొడుకుని విమానం ఎక్కించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌తాడు. కొడుకు కోరిక‌ను నేర‌వేర్చ‌టానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తాడు. అస‌లు ఇంత‌కీ వీర‌య్య‌కి తెలిసిన నిజం ఏంటి? మూడు పూట‌ల స‌రైన తిండి తిన‌టానికే ఇబ్బంది ప‌డే వీరయ్య ఉన్న‌ట్లుండి త‌న కొడుకుని ఎందుకు విమానం ఎక్కించాల‌నుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

పేద‌వాడైన తండ్రి త‌న కొడుకుని ప్ర‌యోజ‌కుడుగా చూడాల‌ని క‌ల‌లు కంటాడు. ఆ ప్ర‌యాణంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తాడు. అలాంటి తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని అద్భుతంగా న‌టించాడు. అది కూడా అవిటిత‌నం ఉన్న వ్య‌క్తిగా. కొడుకు తాహ‌తుకి మించిన కోరిక‌ను అడుగుతున్నాడ‌ని తెలిసినా అత‌న్ని ఏమాత్రం తిట్ట‌డు. బాగా చ‌దువుకోవాల‌ని ఎంక‌రేజ్ చేసే పాత్ర‌ధారిగా ఒక వైపు.. ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటున్న కొడుక్కి స‌మ‌స్య ఉంద‌ని తెలియ‌గానే త‌ల్ల‌డిల్లిపోయే తండ్రిగా మ‌రో వైపు అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. ఇక మాస్ట‌ర్ ధ్రువ‌న్ కూడా అంతే అద్భుతంగా న‌టించాడు. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్‌, కొడుకు కోసం తండ్రి ప‌డే ఇబ్బందులు, అలాగే తండ్రి త‌న కోసం బాధ‌ప‌డుతున్నాడ‌ని కొడుకు త‌న కోరిక వ‌దులుకోవాల‌నుకోవ‌టం ఇవ‌న్నీ ఎమోష‌న‌ల్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

యాంక‌ర్‌ అన‌సూయ.. సుమ‌తి అనే వేశ్య పాత్ర నటించింది. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెడుతుంది. అలాగే సుమ‌తిని ప్రేమించే కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ కూడా ఒదిగిపోయాడు. ఇక ఆటోడ్రైవ‌ర్ డేనియ‌ల్‌గా ధ‌న‌రాజ్ కూడా త‌న రోల్‌కు న్యాయం చేశారు. త‌మిళ నటుడు రాజేంద్ర‌న్ కాసేపే క‌నిపించారు కానీ.. ఆ పాత్ర‌కు అంత పెద్ద ప్రాధాన్య‌త ఉండ‌దు. అలాగే న‌టి మీరా జాస్మిన్ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో నటించింది. డైరెక్టర్‌ శివ ప్ర‌సాద్ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌టానికే ఎక్కువ టైమ్‌ తీసుకున్నాడు. ఈ సినిమాకి వీర‌య్య‌, అత‌ని కొడుకు పాత్ర‌లే హైలైట్‌. వాటి మ‌ధ్య ఎమోష‌న‌ల్ పాయింట్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్టింగ్‌. మిగిలిన పాత్ర‌లు బాగానే ఉన్నా అంత ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం, లిరిక్స్ చాలా బావున్నాయి. నేప‌థ్య సంగీతం చాల బావుంది. వివేక్ కాలేపు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. డైలాగ్స్ బావున్నాయి.

టైటిల్‌ :’విమానం’
నటీనటులు: సముద్రఖని,అనసూయ, ధనరాజ్, రాహుల్ రామకృష్ణ,మీరా జాస్మిన్ తదితరులు
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
నిర్మాత: కిరణ్ కొర్రపాటి-జీ స్టూడియోస్
సంగీతం: చరణ్ అర్జున్

చివరగా.. ఓ తండ్రి ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే ‘విమానం’

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu