తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ సంస్థలు, చానెళ్లు ప్రత్యేకంగా పాటలను రూపొంది విడుదల చేశాయి. అయితే, ఈ ఏడాది విడుదలైన ఓ పాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బాగా నచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. ఆ పాటనతో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక పాట విషయానికి వస్తే.. ఈ ఏడాది బతుకమ్మ సందర్భంగా ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు విమలక్క.. ప్రజా సమస్యలపై పాటలతో గొంతెత్తె విమలక్క… ఈ సారి నల్లమల అడవుల రక్షణపై పాట రూపొందించారు. నల్లమల ఫారెస్టులో ఉన్న విలువైన సంపద గురించి చెబుతూనే.. మరోవైపు తాము ఎలా పోరాటం చేస్తామనే విషయాన్ని తన పాటలో పొందుపర్చారు.
నల్లమల ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యువజన సంఘాలు.. ఇలా సేవ్ నల్లమల పేరుతో సోషల్ మీడియాలో.. ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. సీఎం వైఎస్ జగన్ తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే.. సమయంలో విమలక్క పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ కల్యాణ్… ఈ సాంగ్ ఎంతో ఇన్స్‌పిరేషన్ ఇస్తోందని పేర్కొన్నారు పవన్.
#SaveNallamala song by ‘Vimalakka’ for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019