తమిళ హీరో చియాన్ విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మహాన్’. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు టీజర్ విడుదలైంది. విక్రమ్ గాంధీ మహాన్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం నాటు సారా నేపథ్యంలో సాగనుంది.
నాటు సారాకు వ్యతిరేకంగా, గాంధీ బాటలో నడుస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన మహాన్ అదే మద్యానికి బానిస అవడం వంటి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో విక్రమ్ నటన అదిరిపోయిందనే చెప్పవచ్చు. ‘ఏపీలో ఎవడు బార్ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌ది మంచి ప్రభావం ఉన్న పాత్రలా ఉంది. టీజర్ చివర్లో ధృవ్ ఎంట్రీ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కానుంది.