HomeTelugu Trendingవిక్రమ్ జాడ దొరికేనా?.. సన్నగిల్లుతున్న ఆశలు..!

విక్రమ్ జాడ దొరికేనా?.. సన్నగిల్లుతున్న ఆశలు..!

9 13ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్ తెగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్ గురించి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్రోతో ఒప్పందం మేరకు విక్రమ్ జాడను కనిపెట్టేందుకు అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నాసా కూడా రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 17 వ తేదీన నాసాకు చెందిన ఎల్ఆర్ఓ ఆర్బిటర్ చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ దిగిన ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతాన్ని ఫోటోలు తీసింది. ప్రస్తుతం ఈ ఫోటోలను పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీడ ఎక్కువగా ఉండటంతో పాత ఫొటోలతో పోల్చి చూసి విక్రమ్ జాడ గురించి అంచనా వేస్తారట.

రేపటితో ల్యాండర్, రోవర్ పనికాలం ముగుస్తుంది. చంద్రునిపై లూనార్ పగలు రేపటితో ముగుస్తుంది. దక్షిణ ధృవంపై మరో రెండు వారాలపాటు సూర్యకిరణాలు ప్రసరించవు. అక్కడ మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అంతటి చలిలో విక్రమ్ గడ్డకట్టి పోతుంది. కాబట్టి పనిచేయలేదు. ఏదైనా చేయగలిగితే ఈ ఒక్కరోజే అవకాశం ఉంది. ఇప్పటికే ల్యాండర్ దిగి దాదాపు వారం అవ్వడంతో దానిపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నట్లే కనిపిస్తోంది. గంటలు గడిచే కొద్దీ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టే ప్రక్రియ మరింత కష్టం అవుతూ ఉంటుంది. విక్రమ్ ల్యాండర్‌కి అమర్చిన బ్యాటరీల్లో పవర్ కూడా అంతకంతకూ తగ్గిపోతూ ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu