తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని గుర్తుచేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
How to make an industry prosperous 101
Cannot thank the Telangana Govt. enough for always looking to increase health and prosperity of the economy! @TelanganaCMO @KTRTRS @YadavTalasani
I love my govt.
The Telugu Film industry – one of the biggest in the country.. is thankful 🤍 pic.twitter.com/2SW0R0S9y1— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2021