దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్ మరికొంత కాలం పొడిగించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను విజయశాంతి సమర్ధించారు. మన దేశాన్ని లాక్‌డౌన్ తప్ప మరేమీ రక్షించలేదని, మనదగ్గర ఉన్న ఆయుధం లాక్‌డౌన్ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. సోమవారం నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. అమెరికా పరిశోధన సంస్థ బీసీజీ చెప్పినట్టు భారత్‌లో జూన్ 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తే మంచిదన్నారు. ఈ విషయాన్ని ప్రధానికి కూడా అనేక సార్లు చెప్పానని అన్నారు.
కేసీఆర్ ప్రతిపాదనలను తెలంగాణ కాంగ్రెస్ చైర్ పర్సన్ విజయశాంతి సమర్ధించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను” అంటూ
విజయశాంతి పోస్ట్ చేసారు.