విజయశాంతి.. దాదాపు 13 ఏళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ చేసిన పాత్రకు మంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. చాలా ఏళ్ల తర్వాత నటిగా రీ ఎంట్రీ ఇచ్చినా.. తనలో ఏ మాత్రం ఫైర్ తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ చిత్రం తర్వాత తమ సినిమాల్లో మంచి పాత్రల కోసం దర్శక, నిర్మాతలు హీరోలు ఆమెను సంప్రదిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతిపై తీసిన ఓ వీడియోను అనిల్ రావిపూడి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో బ్రహ్మాజీని విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 13 సంవత్సరం తర్వాత అద్భుతమైన పునరాగమనం మేడమ్. విజయశాంతి మేడమ్ మాస్టర్ కిక్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు విజయశాంతిని అభినందిస్తున్నారు. మునుపటిలా విజయశాంతి చేసిన ఈ షాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
After 13 years….. What a come back @vijayashanthi_m madam…. MASTER KICK 💥💥💥💥💥🤗🤗🤗🤗 భోగి శుభాకాంక్షలు pic.twitter.com/6X9qXLzclR
— Anil Ravipudi (@AnilRavipudi) January 14, 2020