HomeTelugu Trending13 ఏళ్ల తర్వాత విజయశాంతి.. స్వాగతం చెప్పిన దర్శకుడు ..ఫొటో చూశారా

13 ఏళ్ల తర్వాత విజయశాంతి.. స్వాగతం చెప్పిన దర్శకుడు ..ఫొటో చూశారా

1 11విజయశాంతి ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగొందిన నటి. ఆమె దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా కోసం మేకప్‌ వేశారు. స్టార్‌ హీరో మహేష్‌బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె సెట్‌లో అడుగు పెట్టారంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ ట్వీట్‌ చేశారు. ఆమెకు స్వాగతం చెప్పారు. ’13 ఏళ్ల తర్వాత.. ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్‌ టైమ్‌. ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్‌’ అని పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా విజయశాంతికి ట్విటర్‌ వేదికగా స్వాగతం చెప్పారు.

ఇటీవల మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రైలు షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, నరేష్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. దిల్‌రాజు, మహేష్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu