వెటర్నరీ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు స్పందించడానికి మూడు రోజులు పట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలని ఈ ఘటన జరిగిన రోజు నుంచి చాలామంది పేర్కొన్నా కూడా కేసీఆర్ గారు ఆదివారం రోజు వరకు ఈ ఘటనపై స్పందించలేదు. మూడు రోజుల తరువాత ఆలస్యంగా స్పందించడాన్ని కాంగ్రెస్ నేత విజయశాంతి తప్పుపట్టారు.
యావత్ భారతదేశం మొత్తం ఈ ఘటనపై నిరసిస్తూ, రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తుంటే.. మూడు రోజుల తరువాత స్పందించడం ఏంటని ప్రశ్నించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని రాములమ్మ పేర్కొన్నది. సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే విలువ ఉండేదని ఆమె చెప్పారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే… బాధితురాలి తల్లిందండ్రులపై అనుచితంగా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేసింది.