HomeTelugu Trendingవిష‌మంగా విజ‌య్ కాంత్ ఆరోగ్యం.!

విష‌మంగా విజ‌య్ కాంత్ ఆరోగ్యం.!

Vijayakanth heads abroad fo

డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా.. ఆయన ఆరోగ్య పరిస్థితులలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించారు. కాగా సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడ్డారాయన. కొవిడ్‌ నుంచి కోలుకున్నా, ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.

చైన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళుతున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొనలేకపోయారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన జన్మదినం కూడా జరుపుకున్నారు.మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్‌ తన కుమారుడు షణ్ముగపాండియన్, సహాయకులు కుమార్, సోములతో విదేశాలకు ప్రయాణమయ్యారని తెలిసింది. చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu