HomeTelugu Trendingమరోసారి ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్‌

మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్‌

Vijayakanth admitted to the

తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఆసుపత్రికి వెళ్లింది రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 70 సంవత్సరాల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఆయన భార్య ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ‌విజయ్ కాంత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు.

2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో పార్టీ స్థాపించారు. ఇలా నటుడు, పొలిటీషియన్ కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. విజయ్‌కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. 70 ఏళ్ల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu