HomeTelugu Trendingయువ దర్శకుడి సినిమాలో విజయ్‌ దేవరకొండ

యువ దర్శకుడి సినిమాలో విజయ్‌ దేవరకొండ

10 1
యువ దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి సినిమాలో నటించేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హుషారు సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీహర్ష యూత్‌ని బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయ్‌ దేవరకొండకు కథ వినిపిస్తే నచ్చి వెంటనే ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఓ హిందీ సినిమాలో కూడా విజయ్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఫైటర్ అనే టైటిల్‌ పరిశీలనలో
ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu