HomeTelugu Trendingతమన్నాతో రిలేషన్‌పై స్పందించిన విజయ్ వర్మ

తమన్నాతో రిలేషన్‌పై స్పందించిన విజయ్ వర్మ

Tamanna relation with Vijay
మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్‌ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. తమ రిలేషన్‌పై వీరిద్దరూ చాలా కాలం మౌనంగా ఉంటూ ఉత్కంఠను కొనసాగించారు.

లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారు. తాజాగా విజయ్ వర్మ, తమ్మన్నా వీరిద్దరు తమ మనసుల్లోని మాటను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.

మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నాకిప్పుడు బాగా అర్థమైంది. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె రాకతో నా లైఫ్‌లో విలన్ దశ ముగిసిపోయింది. రొమాంటిక్ దశ మొదలైందిఅంటూ చెప్పుకొచ్చాడు. తమన్నాతో ఎంత డీప్‌గా లవ్‌లో ఉన్నాడో అందరికీ అర్థమయింది.

లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌తో తన రిలేషన్‌పై తమన్నా స్పందిస్తూ ‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్. అతడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్ట సమయంలో నాతోనే ఉంటాడన్న నమ్మకం ఉంది’ అని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu