HomeTelugu Big Storiesతమన్నాతో ప్రేమపై విజయ్‌ వర్మ స్పందన

తమన్నాతో ప్రేమపై విజయ్‌ వర్మ స్పందన

vijay varma reacts on relat
టాలీవుడ్‌ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు ఇటీవలే ప్రకటించింది. విజయ్ వర్మ, తన మధ్య ప్రేమ ఉన్న విషయం నిజమేనని తమన్నా అంగీకరించింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో వీరు తొలిసారి కలసి నటించగా, ఆ సమయంలోనే ప్రేమ చిగురించినట్టు చెప్పింది. సహ నటుడు అని కాకుండా తమ మధ్య స్వచ్ఛమైన అనుబంధం ఏర్పడినట్టు వివరించింది. తన మనసుకు దగ్గరయ్యాడని, తనకు అండగా నిలబడతానే నమ్మకం ఏర్పడినట్టు వివరించింది. అతడు ఉన్న చోట తనకు సంతోషం ఉంటుందని తెలిపింది.

తమన్నా వ్యాఖ్యల నేపథ్యంలో వ్యక్తిగత జీవితంపై మాట్లాడాలని విజయ్ వర్మను ఓ మీడియా సంస్థ కోరింది. వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉన్నారని పేర్కొనగా.. ప్రేమలో ఉన్నట్టు పరోక్షంగా అంగీకరించాడు. ‘సరైన టైమ్‌ వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడండి. నా జీవితం ఇప్పుడు ఎంతో ప్రేమతో నిండింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాననే చెప్పగలను’ అని విజయ్ వర్మ స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం కంటే తాను చేసే పనులే మాట్లాడాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu