
తమిళ స్టార్ హీరో దలపతి విజయ్ కొడుకు దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. తాజాగా విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన ఫస్ట్ సినిమాకు సైన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో జేసన్ సంజయ్ తన మొదటి సినిమాకు సైన్ చేశాడు.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు ఎవరా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. అయితే తొలి సినిమాకే సంజయ్ లైకా ప్రొడక్షన్ సంస్థను మెప్పించి నిర్మాణ భాగస్వామ్యులుగా చేశాడంటే మాములు విషయం కాదు. ఈ బ్యానర్ నుంచి రోబో 2.ఓ, పొన్నియన్ సెల్వన్ వంటి బ్లాక్ బస్టర్‌లు తెరకెక్కాయి. అంతేకాకుండా ఈ సంస్థ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కూడా విజయ్ సినిమాతోనే.
తొమ్మిదేళ్ల కిందట ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి లైకాకు తొలి సినిమా. దలపతి విజయ్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు జోసెఫ్ సంజయ్, కూతురు దివ్య శశి ఉన్నారు. ఇక సంజయ్ గతంలో ఉప్పెన సినిమాతో తమిళంలో హీరో ఎంట్రీ ఇస్తున్నాడని, విజయ్ సేతుపతి నిర్మాతగా ఉంటాడని పలు వార్తలు వచ్చాయి.
దీంతో పాటుగా ప్రేమమ్ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ కూడా జేసన్ సంజయ్‌కు ఒక కథ చెప్పారట. అయితే సంజయ్ మాత్రం నటుడిగా కాకుండా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అంతేకాకుండా సంజయ్ లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశాడు. ఇక షారుఖ్ కొడుకు కూడా దర్శకుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.













