HomeTelugu Trendingనన్ను 'చిన్న రాములమ్మ' అని పిలిచారు: శ్రీముఖి

నన్ను ‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు: శ్రీముఖి

7 15
బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖి.. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. అభిమానులతో ‘రాములమ్మ’ అని పిలిపించుకున్నారు. ఇటీవల శ్రీముఖి.. బిగ్‌బాస్‌-సీజన్‌3 రన్నర్‌గా నిలిచి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె విజయశాంతిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

”సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌మీట్‌ స్టేజీపై లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి నన్ను గుర్తుపట్టి.. ‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు. దీంతో నా ఆనందానికి అవధుల్లేవు. మాటలు రాలేదు. ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. 2019లో వృత్తిపరంగా చిరంజీవి గారు నా జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అలాగే 2020 ఆరంభంలో విజయశాంతిని కలవడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది’ అని శ్రీముఖి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu