HomeTelugu Trendingసాయి పల్లవి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన

సాయి పల్లవి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన

Vijay shanthi responded on

సాయి పల్లవి ‘కశ్మీరీ ఫైల్స్’ సినిమాను.. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ముస్లింపై గో సంరక్షుల దాడిని ఒకే గాటన కడుతూ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఎవరూ కూడా మతపరమైన అంశాల జోలకి పోవకపోవడం మంచిదన్న అభిప్రాయాన్ని సాయి పల్లవి వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత, మాజీ నటి విజయశాంతి స్పందించారు. దీనిపై తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు.

‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవ సమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.. తప్పు చేసిన పిల్ల వాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడీ దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.

నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతుంది…. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి’ అంటూ తన పోస్ట్ లో విజయశాంతి పేర్కొన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu