కోలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి సహనటుడిగా నటిస్తూనే హీరోగా ఎదిగాడు. మంచి అవకాశం దొరికితే విలన్ గా చేయడానికి కూడా వెనకాడటం లేదు. పేట సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. అలానే మెగాస్టార్ సైరా సినిమాలో ఓ వీరుడిగా కనిపిస్తున్నారు. విజయ్ సేతుపతి 96 సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ హీరో తలపతి విజయ్ 64 వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ విలక్షణ నటుడు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. హీరో అనే చట్రంలో ఇమిడిపోకుండా.. అన్నిరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి సినిమా ప్రారంభం కాబోతున్నది.