HomeTelugu Big StoriesVijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమా మళ్లీ మళ్లీ చూశాను

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమా మళ్లీ మళ్లీ చూశాను

Vijay Sethupathi repeatedly watched this Mahesh Babu film
Vijay Sethupathi repeatedly watched this Mahesh Babu film

Vijay Sethupathi about Mahesh Babu movie:

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తెలుగులో ఉప్పెన అనే సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కూడా విజయ్ సేతుపతి నటించిన చాలా సమస్యలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలు అందుకున్నాయి.

ఈ మధ్యనే మహారాజా సినిమాతో Vijay Sethupathi మరొక అతి పెద్ద బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు తమిళ్లో పాటు తెలుగులో కూడా ఈ సినిమా చాలా మంచి హిట్ అయింది. అయితే తాజాగా విజయ్ సేతుపతి చేసినా కొన్ని కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమా చూశాను అంటూ విజయ సేతుపతి కామెంట్లు చేశారు. ఇంతకీ అది అతడు సినిమా. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా.. త్రిష హీరోయిన్ గా వచ్చిన అతడు సినిమా 2005లో చాలా పెద్ద హిట్ అయింది. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో విజయ్ సేతుపతి ఆ సినిమాని చూశారట.

“సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ దాకా అన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాలోని భావోద్వేగాలను చాలా బాగా చూపించారు. మహేష్ బాబు త్రిష ల మధ్య ఉండే రొమాన్స్ కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్, సినిమాలో పాటలు అన్నీ చాలా బాగుంటాయి” అనే సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు విజయ్ సేతుపతి.

ప్రస్తుతం విజయ్ సేతుపతి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ సేతుపతి కూడా తెలుగులో ఫాలోయింగ్ ఉన్న హీరో. అయినప్పటికీ మహేష్ బాబు గురించి పొగుడుతూ విజయ్ సేతుపతి తన మంచితనాన్ని చాటుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu