విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టింవ్‌గా ఉండే నటుడు న్యూ లుక్‌లో కనిపించి నెటిజన్లను ఆశ్చర్య పరిచాడు. షాపింగ్‌కు వెళ్లినపుడు డ్రెస్సింగ్ రూంలో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తమ అభిమాన హీరోను స్లిమ్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఇంటర్‌నెట్‌లో తెగ షేర్ చేస్తున్నారు. ఈ న్యూ లుక్‌తో ఓ సినిమా చేయాలంటూ కోరుతున్నారు.
విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మైఖేల్, మేర్రీ క్రిస్మస్, ముంబైకర్ సినిమాలతోపాటు పలు ప్రాజెక్ట్‌లు విజయ్ సేతుపతి ఖాతాలో ఉన్నాయి.
https://www.instagram.com/p/CmEj8-BJ63u/?utm_source=ig_web_copy_link