ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి అనేక విమర్శలు పోఎదుర్కొంటోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మురళీధరన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ – వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. 800 మోషన్ పోస్టర్ లాంచ్ తరువాత ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యింది.
శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళిధరన్ తన పై సినిమా తీయవద్దు అంటూ ఓ లేఖను విడుదల చేశాడు. ఈ లేఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తన పై సినిమా తీయకపోవడమే ఉత్తమమని మురళిధరన్ పేర్కొన్నాడు. దానికి విజయ్ సేతుపతి స్పందిస్తూ.. తాను సినిమా నుంచి తప్పుకుంటున్నానని అని ప్రకటించాడు.