తమిళ రాజకీయాల్లోకీ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఎంట్రీ ఇస్తున్నారు అని, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ… తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక తేనాంపేటలోని అరివాలయంలో ‘స్టాలిన్ 70’ పేరుతో ఒక ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేయగా, దీనిని అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి కూడా ఈ ఎగ్జిబిషన్‌ను తెలకించారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
ఇదే సమయంలో స్టాలిన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ 70 యేళ్ళ జీవితం ఈ ఫొటోల్లో ప్రతిబింబిస్తుంది. ఆయన వారసత్వంతో ముఖ్యమంత్రి కాలేదు. కఠోర శ్రమతో సీఎం పదవిని చేపట్టారు. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలి.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు