తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ, తెలుగు సినిమాల్లో విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్టుగాను నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్నారని టాక్. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ సేతుపతికి ఓ కథను కూడా వినిపించారట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. త్వరలోనే సినిమాకి సంబంధించి వివరాలు తెలియనున్నాయని తెలుస్తోంది. విజయ్ ఇప్పటికే తెలుగు భాషను నేర్చుకుంటున్నాడని సమాచారం. విజయ్ నటించిన ‘పిజ్జా’, ‘అంజలి సీబీఐ’, ‘పేట’ వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.