టాలీవుడ్‌లో గీతాగోవిందం సినిమాతో మంచి క్రేజ్‌ని సంపాందిచారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాలు చేశారు. అయితే ఈ క్రేజీ కపుల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుండో పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి. విజయ్, రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరి రెండో వారంలోనే వీరి నిశ్చితార్థం అని తెలుస్తుంది. తాజా కథనం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలోనే తమ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించి ప్రకటన కూడా చేయనున్నారట.
దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఈ లవ్ బర్డ్స్ మధ్య ప్రేమ, వెకేషన్ వార్తలు చాన్నాళ్లుగా వస్తున్నా.. వీళ్లు ఎప్పుడూ బయటపడలేదు. అయితే ప్రేక్షకులు మాత్రం వీరు షేర్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఫిక్స్ అయిపోయారు.
గతేడాది మాల్దీవ్స్ వెకేషన్ కు కూడా కలిసి వెళ్లారని, తర్వాత దీపావళి పండుగను కూడా రష్మిక విజయ్ ఇంట్లోనే జరుపుకుందని ఫొటోలతో సహా ఫ్యాన్స్ నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు పెళ్లి, నిశ్చితార్థం విషయంలోనూ వాళ్లు అదే సీక్రెసీని మెయింటేన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ వీరి సినిమాలతో బిజీగా ఉన్నారు.