టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దానిని కన్ఫమ్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఆ మధ్య మాల్దీవ్స్ టూర్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి వెళ్లడం, రావడం ఎవరూ చూడలేదు.
మాల్దీవ్స్ లో కలిసి ఉన్న ఫొటోలూ రాలేదు. కానీ ఇప్పుడు హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం విజయ్, రష్మిక మాల్దీవ్స్ లో ఓ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటోలను తెరపై చూపించింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఓ ఏవీ ప్లే చేస్తున్న సమయంలో మధ్యలో వీళ్ల ఫొటో ప్రత్యక్షమైంది. ఇలా ఓ ప్రైవేట్ ఫొటోను సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అంత పెద్ద స్క్రీన్ పై చూపించడమేంటని ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
ఆ ఫొటో రాగానే ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ.. తనదైన స్టైల్లో ఏదో సరదా కామెంట్ చేసినా అది అభిమానుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఆ తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఫొటో తెరపై కనిపించగానే కింద కూర్చున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తూ నవ్వింది. సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటి వరకూ తమ మధ్య బంధాన్ని బయటపెట్టని ఓ సెలబ్రిటీ జంట ఫొటోలను వాడుకోవడం తప్పని ఫ్యాన్స్ అంటున్నారు.
నిజానికి విజయ్, రష్మిక అధికారికంగా చెప్పలేదు కానీ.. వీళ్లు డేటింగ్ లో ఉన్నారన్న విషయం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఈ ఇద్దరూ ఒకే రకమైన టీషర్ట్ లలో కనిపించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. రష్మిక ముంబైలో, విజయ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. అయితే ఇద్దరూ ఒకే రకమైన టీషర్ట్స్ ధరించడం మాత్రం విశేషం. అయితే ఇప్పటి వరకూ వీరు తమ రిలేషన్షిప్ పై స్పందించలేదు.