కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రంపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సాలిడ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఓ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు మరింత స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రారంభం కావడం తో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన మేకర్స్ నిన్ననే ఈ సినిమా టైటిల్ పై కూడా సాలిడ్ అప్డేట్ ని అందించారు.
ఈ టైటిల్ ఈరోజు ప్రకటించినున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ కే తో స్టార్ట్ అవుతుంది అని అలాగే ఆంగ్లం లో మొత్తం 7 అక్షరాలు ఉంటుంది అని ఓ సాలిడ్ హింట్ బయటకి రాగ దీనితో ఈ టైటిల్ ‘ఖైదీ 2’ అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ టైటిల్ ఆల్రెడీ కార్తీ సినిమాతో ఉంది కానీ దీనికి కూడా లింక్ ఉండొచ్చు ఏమో అని ఓ పాజిటివ్ కోణం కూడా కనిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావలంటే సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే.