చాలా ఏళ్ల క్రితం రజినీకాంత్, మమ్ముట్టి కాంబినేషన్ లో మణిరత్నం ‘దళపతి’ అనే సినిమాను రూపొందించాడు. అప్పట్లో ఆ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆ టైటిల్ కే సగం హిట్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు అదే టైటిల్ తో విజయ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది.
ఈ సినిమాలో సమంతా, కాజల్, నిత్యమీనన్ వంటి తారలు కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ అయితే పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. కాబట్టి అదే టైటిల్ ను కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. విజయ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో ఓ పాట కూడా పాడబోతున్నారు.