సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులను సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోగానే తెలుసు.. వాస్తవానికి అతగాడి ఫైనాన్షియల్ స్టేటస్ ఓ రేంజ్ లో ఉంటుంది. జెఎంజె గ్రూప్ ఆఫ్ కంపనీస్ కు వైస్ ఛైర్మన్ అయిన సచిన్ జోషి రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడు. తెలుగు సినిమాల్లో ఎప్పటికైనా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని అతి త్వరలో ‘వీడెవడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజాగా ఈ హీరో విజయ్ మాల్యాకు సంబంధించిన ఓ విల్లాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. గోవాలోని విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను చాలా కాలంగా వేలం వేస్తున్నారు. అయితే ధర ఎక్కువ ఉండడంతో కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదు. దీంతో 85 కోట్ల నుండి ఎస్.బి.ఐ సంస్థ 73 కోట్లకు దిగింది. ఆ మొత్తాన్ని చెల్లించి బ్యాంక్ అధికారుల నుండి విల్లాను తన సొంతం చేసుకున్నాడు సచిన్ జోషి. కండోలిమ్ అరేబియా సముద్రానికి ఎదురుగా ఉండే ఈ విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి.