గతంలో విజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గుండేజారి గల్లంతయ్యిందే’ సినిమా సూపర్
సక్సెస్ ను అందుకుంది. నితిన్ కెరీర్ కు ఈ సినిమాకు కీలకంగా మారింది. ఆ తరువాత ఈ చిత్రానికి
సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. తాజాగా విజయ్ ఓ కథను
సిద్ధం చేసుకొని వరుణ్ తేజ్ కు వినిపించినట్లు తెలుస్తోంది. వరుణ్ కు కూడా కథ నచ్చడంతో
వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల డైరెక్షన్ లో ‘మిస్టర్’ సినిమాలోనూ..
అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాలోను నటిస్తున్నాడు. తను నటించే ప్రతి
సినిమా వైవిధ్యంగా ఉండాలని కోరుకునే మన హీరో అలానే తన కథలను కూడా ఎన్నుకుంటున్నాడు.
వరుణ్ ఈ రెండు సినిమాలను పూర్తి చేసి విజయ్ తో సెట్స్ పైకి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. వచ్చే
సంవత్సరం మొదట్లోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.