కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సొంత పార్టీని కూడా ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దళపతి దృష్టి పెట్టినట్లు సమాచారం. అందుకు గాను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు.
ప్రస్తుతం విజయ్ సినిమాకు వంద కోట్లకు మించి పారితోషికం తీసుకుంటూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు. విజయ్ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించేందుకు సినీ పరిశ్రమకు పూర్తిగా స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా మరో కొన్ని సినిమాలు విజయ్ కమిట్ అయ్యాడు. మన తెలుగు నిర్మాత దానయ్య తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా దర్శకుడు కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమాకి దానయ్య విజయ్‌కు భారీ రెమ్యూనరేషన్ రూ.200 కోట్ల ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ కారణంగానే విజయ్ ఆ సినిమాను కమిట్ అయ్యాడు అంటూ టాక్. దానయ్య
బ్యానర్ లో చేయబోతున్న సినిమా విజయ్ కి చివరి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్ హీరోల్లో రూ.200 కోట్ల పారితోషికం అందుకోబోతున్న మొదటి హీరోగా విజయ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. విజయ్ సినిమా మినిమం టాక్ వచ్చినా కూడా ఈజీగా 250 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉంటుంది. ఇక హిట్ అయితే అన్ని రకాలుగా కలిపి రూ.500 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.